Magazines

చాంపియన్‌ సింధు

1 గంట క్రితం

Champion Sindhu
avatar
balaji

ప్రచురించబడింది నవం 01, 2026 | 1 నిమిషాల చదవడం

హైలో ఓపెన్‌ సూపర్‌ 500

న్యూఢిల్లీ : భారత అగ్రశ్రేణి షట్లర్‌ పి.వి సింధు టైటిల్‌ నిరీక్షణకు తెరపడింది. వరుసగా రెండో వారంలో టైటిల్‌ పోరుకు చేరుకున్న తెలుగు తేజం ఎట్టకేలకు చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో పి.వి సింధు 21-12, 21-14తో ఎనిమిదో సీడ్‌, డెన్మార్క్‌ షట్లర్‌ లినెపై వరుస గేముల్లో గెలుపొందింది. భీకర ఫామ్‌ కొనసాగించిన సింధు ఏ గేమ్‌లోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. 39 నిమిషాల్లోనే లాంఛనం ముగించి బిడబ్ల్యూఎఫ్‌ సూపర్‌ 500 టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. పురుషుల సింగిల్స్‌లోనూ లక్ష్యసేన్‌ ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్