- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇరాన్‌పై దాడిని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. టెహ్రాన్, కొన్ని మధ్యప్రాచ్య దేశాల అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఇరాన్ అణు ముప్పును తొలగించే ఒప్పందంపై అంగీకారం కుదిరిందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ నిర్ణయంలో అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కూడా ఉందని, సౌదీ అరేబియా యువరాజు కూడా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసినట్లు కథనాలు వస్తున్నాయి.
- Advertisement -



