నవతెలంగాణ-నవాబుపేట
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా సోమవారం డాక్టర్ శ్రావణ్ కుమార్ మెడికల్ ఆఫీసర్, సిడిపిఓ శ్రీశైల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరించారు.తల్లిపాలు అంటే కేవలం బిడ్డకు ఆహారం కాదు బిడ్డకు జీవిత బీమా గా భావించవచ్చని, అదేవిధంగా ఆరు నెలల వరకు తల్లి బిడ్డకు పాలు ఇవ్వాలని, తల్లిపాలు బిడ్డ హక్కని ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేయాలంటే మొదటి అడుగు తల్లిపాలతోనే మొదలవ్వాలని డాక్టర్ అన్నారు. సి డి పి ఓ మాట్లాడుతూ.. బాలింతలు బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలని వారు బలంగా ఉంటేనే బిడ్డకు సమర్థవంతమైనటువంటి పాలు ఇస్తారని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది బాలమ్మ విజయమ్మ శ్రీనివాసులు సుధాకర్ శరభ లింగం శ్రీనివాసులు శారద మరియు అంగన్వాడి కార్యకర్తలు మరియు ఆశా కార్యకర్తలు వివిధ గ్రామాల నుంచి వచ్చిన బాలింతలు పాల్గొన్నారు.
తల్లిపాల వారోత్సవాలపై అవగాహన కార్యక్రమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



