టైటిల్ గ్లింప్స్, తొలి పాటతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ చిత్ర బృందం ఇప్పుడు రెండో పాట ‘ఇంత ఇష్టమా’ ను విడుదల చేసింది. శ్రీవిష్ణు, మహిమా నంబియార్ జంటగా నటిస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. కోన వెంకట్ సమర్పణలో, వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన ఈ లవ్ మెలోడీ హీరో చూపించే నిస్వార్థమైన ప్రేమ, ఆప్యాయతకు హీరోయిన్ మెస్మరైజై, అతనిపై ప్రేమను పెంచుకునే భావోద్వేగాలను అందంగా చూపించారు. భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం ఈ ప్రేమ పాటకు మరింత అందాన్ని తీసుకురాగా, రామ్ మిర్యాల, లిప్సిక వోకల్స్ తో పాటకు ప్రాణం పోశారు. శ్రీవిష్ణు, మహిమా నంబియార్‌ల మధ్య కెమిస్ట్రీ, ఆకట్టుకునే విజువల్స్ ఈ పాటను మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. 1992 నాటి ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘కామ్రేడ్ కళ్యాణ్’ యాక్షన్, భావోద్వేగాలు, ఆకట్టుకునే ప్రేమకథ కలగలిపిన చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రంలో రాధిక శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే నటిస్తున్న ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్, ఎడిటింగ్ : చోటా కె. ప్రసాద్. సంగీతం: విజయ్ బుల్గానిన్.
అందమైన ప్రేమకథ..
- Advertisement -
- Advertisement -



