Thursday, August 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలూర్ లో ఇందిరమ్మ ఇండ్లకు భూమిపూజ

ఆలూర్ లో ఇందిరమ్మ ఇండ్లకు భూమిపూజ

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూర్ మండల కేంద్రంలో పేదల కోసం నిర్మించబోయే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి బుధవారం భూమి పూజ, మార్కింగ్ (ముగ్గు) కార్యక్రమం నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం రూ. 5 లక్షలు మంజూరు అయిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ ముక్కెర విజయ్, ఎంపీవో గంగమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్టు తెలిపారు. పేదవారికి సొంత ఇంటి కలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎవరు అభ్యర్థిగా నిలిచినా గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదేనని నేతలు పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా లబ్ధిదారులు  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి,  కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు రాజలింగం, తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ముత్యం రెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -