నవతెలంగాణ-హైదరాబాద్ : వ్యాపారవేత్తగా ఎదగడం ఇప్పుడు ప్రధాన వృత్తిపరమైన ఆకాంక్షగా మారుతోంది. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన ఒకప్పుడు కొందరికే పరిమితమైతే, ప్రస్తుతం అది ప్రధాన కెరీర్ మార్గంగా రూపాంతరం చెందుతోంది. సర్వేలో పాల్గొన్న ప్రతి పది మంది భారతీయులలో ఎనిమిది మందికి పైగా (85%) తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నట్లు చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్వర్క్ అయిన లింక్డ్ఇన్ పరిశోధన ప్రకారం, ఈ మార్పుకు యువ తరాలు నాయకత్వం వహిస్తున్నాయి. జెన్ జి లలో 94% , మిలీనియల్స్ లో 90% తమకు వ్యవస్థాపక ఆశయాలు ఉన్నాయని చెప్పారు. వీరిలో ప్రతి పది మంది జెన్ జి లలో ఏడుగురు (70%) రాబోయే మూడేళ్లలో వ్యాపారం లేదా సైడ్ హస్ల్ ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఈ ఆశయాలు స్త్రీపురుషుల మధ్య దాదాపు సమానంగా ఉన్నాయి. 91% మంది మహిళలు మరియు 94% మంది పురుషులు రాబోయే కొన్నేళ్లలో తమ వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.
లింక్డ్ఇన్ డేటా వెల్లడించే దానిప్రకారం, వ్యాపారం ప్రారంభించాలనే ఆకాంక్ష కార్యరూపం దాలుస్తోంది. 2022 నుంచి తమ లింక్డ్ఇన్ ప్రొఫైళ్లలో ‘ఫౌండర్’ (వ్యవస్థాపకుడు) అనే హోదాను చేర్చుకున్న సభ్యుల సంఖ్య 190 శాతం పెరిగింది. ఇందులో జెన్ జి వాటా అత్యధికంగా 383 శాతం వృద్ధి చెందింది. జెన్ జెడ్ వేగంగా ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నప్పటికీ.. ప్రస్తుతం లింక్డ్ఇన్లో ఉన్న వ్యవస్థాపకుల్లో మిలీనియల్స్ అత్యధికంగా 48 శాతం వాటాతో ముందున్నారు.
డిజిటల్ సాధనాలు , ఏఐ ద్వారా చిన్న వ్యాపారాల వృద్ధి జరుగుతోంది. సర్వేలో పాల్గొన్న 86% మంది భారతీయులు, ఐదేళ్ల క్రితం కంటే ఇప్పుడు వ్యవస్థాపకులుగా మారడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నమ్ముతున్నారు. సోషల్ మీడియా ద్వారా వినియోగదారులను చేరుకోగల సామర్థ్యం (74%), వ్యాపార పరిజ్ఞానాన్ని సులభంగా పొందగలగడం (63%) వంటి కారణాలను స్పందనదారులు పేర్కొన్నారు. వ్యాపారవేత్తలు తమకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి, సంభావ్య వినియోగదారులు, భాగస్వాములతో అనుసంధానం కావడానికి లింక్డ్ఇన్ వంటి వేదికలు ఉపయోగపడతాయని 42 శాతం మంది తెలిపారు.
కృత్రిమ మేధ (ఏఐ) వ్యవస్థాపకతను అందరికీ అందుబాటులోకి తెస్తోంది.
వేగంగా వ్యాపార రంగంలోకి ప్రవేశించడానికి ఉన్న అడ్డంకులను తగ్గిస్తూ, వ్యవస్థాపకులకు మౌలిక సదుపాయాలలో ఒక కీలక భాగంగా ఏఐ మారుతోంది. సర్వేలో పాల్గొన్న పది మంది భారతీయ చిన్న వ్యాపార వ్యవస్థాపకులలో తొమ్మిది మందికి పైగా ఏఐ ని ఉపయోగిస్తున్నారు. తమ వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా నడపడానికి ఏఐ , డిజిటల్ సాధనాలు సహాయపడ్డాయని చెప్పిన వారిలో, మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది (36%) తాము ఇంతకు ముందు అందించలేని ఉత్పత్తులు లేదా సేవలను అందించడానికి ఈ సాంకేతికత సహాయపడిందని తెలిపారు. ఏఐ ని వినియోగిస్తోన్న వ్యవస్థాపకులలో మరో 23% మంది, ఈ సాంకేతికత లేకపోతే వ్యాపారం కోసం మరింత పెట్టుబడి అవసరమయ్యేదని అభిప్రాయపడ్డారు.
లింక్డ్ఇన్ ఇండియా కంట్రీ మేనేజర్ కుమారేష్ పట్టాభిరామన్ మాట్లాడుతూ “భారతదేశం ప్రస్తుతం వ్యవస్థాపకత పరంగా ఒక కీలక మార్పు దశలో ఉంది. వ్యాపారాన్ని ప్రారంభించడం అనేది ఇకపై కెరీర్ కు దూరంగా వేసే అడుగు కాదు; లక్షలాది మందికి, అది వారి కెరీర్లో ఒక భాగంగా మారుతోంది. ఏఐ తన ప్రయత్నాలు ప్రారంభించే ఖర్చును తగ్గిస్తోంది, కానీ ఒక ఆలోచనను వ్యాపారంగా మార్చేది మనుషులే: తొలి అవకాశానికి మార్గం చూపించే నెట్వర్క్, సేవలను అందించే బృందం, నమ్మకాన్ని చూపించే వినియోగదారులు.. వీరే కీలకం.. ఇక్కడే లింక్డ్ఇన్ పాత్ర మొదలవుతుంది. అత్యంత వేగంగా ఎదిగే వ్యవస్థాపకులు సరైన సమయం కోసం వేచి ఉండరు. వారు ముందుగా ప్రారంభిస్తారు, ముందుకు సాగుతున్న కొద్దీ సరైన సంబంధాలను నిర్మించుకుంటారు” అని తెలిపారు.
ఏఐ వినియోగం పెరిగేకొద్దీ, విశ్వసనీయ సంబంధాలకు ప్రాముఖ్యత పెరుగుతోంది
వ్యాపారాల్లో ఏఐ వినియోగం పెరుగుతున్న కొద్దీ వృత్తిపరమైన సంబంధాల విలువ కూడా పెరుగుతోంది. ఏఐ తమ వ్యాపారాల్లో మరింత కీలక పాత్ర పోషించే కొద్దీ బలమైన ప్రొఫెషనల్ నెట్వర్క్ ప్రాధాన్యం మరింత పెరుగుతుందని సర్వేలో పాల్గొన్న భారతీయ చిన్న వ్యాపార వ్యవస్థాపకుల్లో దాదాపు తొమ్మిది మందిలో ఎనిమిది మంది (88 శాతం) అభిప్రాయపడ్డారు. కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వ్యవస్థాపకులు ఎక్కువగా ఈ వృత్తిపరమైన నెట్వర్క్లపైనే ఆధారపడుతున్నారు. నిర్ణయాల కోసం ప్రొఫెషనల్ నెట్‌వర్క్‌లను సంప్రదిస్తున్నవారు 41 శాతం ఉండగా, నిపుణుల సలహాదారులను ఆశ్రయిస్తున్నవారు 39 శాతం, ఏఐ సాధనాలను ఉపయోగిస్తున్నవారు 38 శాతంగా ఉన్నారు.
వృత్తిపరమైన నెట్‌వర్క్‌లు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో, వాటిలో బలమైన కీర్తిని సంపాదించుకోవడం కూడా అంతే అవసరం. సర్వేలో పాల్గొన్న ప్రతి ఐదుగురు వ్యవస్థాపకులలో నలుగురు (80%) తాము కంటెంట్ సృష్టికర్తలుగా మారవలసి వచ్చిందని, విశ్వసనీయతను పెంచుకోవడానికి, తమ పరిధిని విస్తరించుకోవడానికి తమ వ్యక్తిగత బ్రాండ్‌ను ఉపయోగించుకుంటున్నామని చెప్పారు. అదనంగా, 88% మంది తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి వ్యక్తిగత బ్రాండ్‌ను నిర్మించుకుంటున్నట్లు చెప్పారు.
పోర్ట్‌ఫోలియో కెరీర్ పెరుగుదల
వ్యవస్థాపకులు ఒకే వ్యాపారానికి పరిమితం కాకుండా , బహుళ ఆదాయ మార్గాలను , విభిన్న వ్యాపార ప్రాజెక్టులను ఏకకాలంలో నిర్వహిస్తూ, పోర్ట్‌ఫోలియో కెరీర్ వైపు మారుతున్నారు. సర్వేలో పాల్గొన్న భారతీయ చిన్న వ్యాపార యజమానులలో 75 శాతం మంది తాము బహుళ ఆదాయ మార్గాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇది, ప్రజలు వ్యాపారాలు, సైడ్ ప్రాజెక్ట్‌లు మరియు ఇతర ఆదాయ వనరులను మిళితం చేసే మరింత సౌకర్యవంతమైన నమూనాను సూచిస్తోంది.
వ్యాపారవేత్తగా మారాలనే ఆకర్షణలో ఈ వెసులుబాటు కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది. సర్వే చేయబడిన భారతీయ వ్యవస్థాపకులలో, వ్యవస్థాపకులుగా మారడానికి గల ప్రధాన ప్రేరణలు: తమ పనులను తమ సొంత మార్గంలో చేసుకునే స్వేచ్ఛ (56%), సంపాదించే సామర్థ్యం (52%), మరియు ఎక్కువ నియంత్రణ మరియు సౌలభ్యం (49%) గా పేర్కొన్నారు. 41% మంది మాత్రం ఇతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశంతో ప్రేరణ పొందుతున్నారు.
మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి, మీ వినియోగదారులను కనుగొనడానికి, మీరు ఏమి చేస్తారో పంచుకోవడానికి, డబ్బు సంపాదించడానికి మీకు సహాయపడే సరైన సాధనాలు అవసరమని మాకు తెలుసు. మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి లింక్డ్ఇన్ సాధనాలను ఉపయోగించుకోవడానికి ఇక్కడ 5 మార్గాలు ఉన్నాయి:
1. మీరు చేస్తున్న పనులన్నింటినీ ప్రొఫైల్‌లో పొందుపరచండి: మీరు ఒక వ్యాపారాన్ని నడుపుతున్నా లేదా ఒకేసారి పలు ఉద్యోగాలను నిర్వహిస్తున్నా, మీ అనుభవంలో ఒకటి కంటే ఎక్కువ ప్రస్తుత పాత్రలను చూపించే ఎంపికతో, మీరు ఇప్పుడు మీ ప్రొఫైల్‌లో దానిని మరింత సులభంగా ప్రదర్శించవచ్చు.
2. శాశ్వత సంబంధాలను ఏర్పరచుకోండి: వ్యక్తిగతంగా పరిచయమైన వారితోనూ దీర్ఘకాలిక సంబంధాలు కొనసాగించేందుకు లింక్డ్ఇన్ బిజినెస్ కార్డును రూపొందించుకోవచ్చు. ప్రీమియం బిజినెస్ సబ్స్క్రైబర్లు కొత్త ప్రైవేట్ కనెక్షన్ నోట్స్ సదుపాయంతో.. ఎవరిని ఎక్కడ కలిశారో గుర్తుంచుకునేందుకు వారి ప్రొఫైళ్లలో వ్యక్తిగత నోట్‌ను జతచేయవచ్చు..
3. మీ నైపుణ్యాన్ని ఆదాయంగా మార్చుకోండి: అడ్వైస్ సెషన్స్‌తో, మీరు మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ నుండే నేరుగా 1:1 చెల్లింపు సంప్రదింపులను అందించవచ్చు. అలాగే, కొత్త డ్యాష్‌బోర్డ్‌లో ఆదాయ అవకాశాలను పరిశీలించడంతోపాటు కొత్త సంభావ్య వినియోగదారుల వివరాలను తెలుసుకోవచ్చు.
4. మీ వ్యాపారానికి ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసుకోండి: ప్రీమియం కంపెనీ పేజీలు మీ వ్యాపారానికి విశ్వసనీయమైన ల్యాండింగ్ పేజీని అందిస్తాయి. దీనిలో మీరు మీ బ్రాండ్‌ను ప్రదర్శించవచ్చు. కస్టమ్ బటన్, టెస్టిమోనియల్స్, ఆటో ఇన్వైట్-టు-ఫాలో వంటి సదుపాయాలతో మరింత మందికి చేరువ కావచ్చు.
5. నిర్వహణ పనులకంటే వ్యాపార వృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టండి: మీ వ్యాపారం పెరిగేకొద్దీ, మీరు మరిన్ని బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుందని మాకు తెలుసు. చిన్న వ్యాపార యజమానుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ‘ప్రీమియం ఆల్-ఇన్-వన్’ వినియోగదారులను గుర్తించడం, ఎక్కువ మందికి చేరువ కావడం, ఉద్యోగులను నియమించుకోవడం వంటి అవసరాలకు ఉపయోగపడే సాధనాలను ఒకేచోట అందిస్తుంది.




కామెంట్లు (0)