ఎన్విడియా సీఈఒ సంపద క్షీణత
వాషింగ్టన్ : దిగ్గజ చిప్ కంపెనీ ఎన్విడియా అధినేత జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత సంపద ఒక్కరోజులోనే భారీగా క్షీణించింది. సోమవారం స్టాక్ మార్కెట్‌లో ఎన్విడియా షేర్ల అమ్మకాల ఒత్తిడితో ఆయన నికర సంపద 7.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ.69,560 కోట్లు) తగ్గి 154.7 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.14.54 లక్షల కోట్లు) పరిమితమయ్యింది. దీంతో ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన ఎనిమిదో స్థానం నుంచి పదో స్థానానికి దిగజారారు. మార్కెట్ ప్రారంభ సమయంలో 162.2 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ.15.25 లక్షల కోట్లు) ఉన్న ఆయన సంపద తొలి 30 నిమిషాల్లోనే 154.7 బిలియన్ డాలర్లకు పడిపోయింది. సోమవారం ట్రేడింగ్‌లో ఎన్విడియా షేరు ధర ఒక దశలో 7 శాతానికి పైగా క్షీణించగా, ముగింపు సమయానికి 4.3 శాతం నష్టపోయింది. హువాంగ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆరోపణలు, చైనాకు ఎన్విడియా చిప్‌ల సరఫరాపై వెలువడిన కథనాలు షేర్ల అమ్మకాల ఒత్తిడికి కారణమయ్యాయి.






కామెంట్‌లు (0)