Sunday, August 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఏడు రకాల సన్న వడ్లకే బోనస్.!

ఏడు రకాల సన్న వడ్లకే బోనస్.!

- Advertisement -

ఆన్లైన్ తప్పనిసరి ఏవో బొల్లపల్లి శ్రీజ
వచ్చేనెల 1వరకు గడువు
నవతెలంగాణ – మల్హర్ రావు

ఎల్నినో పరిస్థితులతో వరి సాగు తగ్గించాలని ప్రభుత్వం సూచిస్తోంది.అయినప్పటికీ నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో రైతులు సాగుకు మొగ్గు చూపుతున్నారు.ఇందులో అత్యధికంగా సన్న రకాలే ఉండగా, గతంలో మాదిరి అన్నింటికీ కాక రూ.500 బోనస్ కొన్ని రకాలకే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నిర్దేశించిన (తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ 15048), సాంబమసూరు (బిపిటి 5204), కెఎన్ఎం 1638,హెచ్ఎంటి సోనా, జై శ్రీరామ్,డబ్ల్యూజిఎల్ 44,కెఎన్ఎమ్ 7715  తదితర ఏడు రకాలు సాగు చేసే రైతులు కూడా ఆన్లైన్లో నమోదు చేసు కుంటేనే బోనస్ అందనుందని.డీలర్లు,వ్యవసాయ విస్తర్ణాధికారుల వద్ద ఆన్లైన్ చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి బొల్లపల్లి శ్రీజ సూచిస్తున్నారు.వచ్చేనెల 1వ తేదీ వరకు గడువు విధించారని తెలిపారు.

డీలర్లు,ఏఈఓల వద్ద..
నిర్దేశిత రకాల విత్తనాలను కొనుగోలు చేసిన రైతులు పట్టాదారు పాస్ పుస్తకం,ఆధార్ కార్డు, రశీదుతో డీలర్ను కలిసి ఆన్లైన్లో నమోదు చేయించు కోవాలి.సొంతంగా విత్తనాలు సమకూర్చుకున్న వారే కాక ఇతర రైతులు, పరిశోధనా కేంద్రాల నుంచి, అనుమతి పొందిన ఇతర వనరుల నుంచి కొత్త వినాలు తెచ్చుకుంటే వ్యవసాయ విస్తరణ అధికారికి ధ్రువీకరణ పత్రం సమర్పించి నమోదు చేయించు కోవాలి.కాగా,ఎల్నినో కారణంగా నీటి వనరులు తగ్గడంతో వరిసాగు విస్తీర్ణం పడిపోయింది.మండలంలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 15,300 ఎకరాలు కాగా, ఇప్పటి వరకు కేవలం 8500 వేల ఎకరాల్లో లక్షల ఎకరాల్లో వరి సాగైంది.ఇవి కూడా సన్న రకాలేనని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -