Magazines

తాత హత్య కేసులో 740 పేజీల ఛార్జ్‌షీట్‌

36 నిమిషాల క్రితం

740-page charge sheet in grandfather's murder case
avatar
Kalluri Elender

ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌ : ఐఫోన్‌, మోటార్‌సైకిల్‌ కొనుగోలుకు డబ్బుల కోసం 13 ఏళ్ల బాలిక తన ముగ్గురు స్నేహితులతో కలిసి తాతను హత్య చేసిన ఘటన కేరళలో కలకలం రేపింది. కరవట్టలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు జువైనల్‌ జస్టిస్‌ బోర్డుకు 740 పేజీల ఛార్జ్‌షీట్‌ సమర్పించారు. పోలీసుల వివరాల ప్రకారం.. 13 ఏళ్ల బాలికతో పాటు 16, 17 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలురు ఇన్‌స్టాగ్రామ్‌ చాట్స్‌ ద్వారా రెండు నెలల పాటు హత్యకు ప్రణాళిక రచించారు. ఆగస్టు 15న ఇంట్లో ఒంటరిగా ఉన్న 67 ఏళ్ల వృద్ధుడిని హత్య చేసి, సుమారు నాలుగున్నర తులాల బంగారం దొంగిలించారు.


ఈ ఘటనను బాలికకు వాట్సాప్‌ వీడియో కాల్‌లో చూపించినట్లు విచారణలో వెల్లడైంది. ఆగస్టు 17న ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ దృశ్యాలు, ఫోన్‌ సంభాషణలు సహా 87 మంది సాక్షులు, 98 పత్రాలు, 12 వస్తువులను ఆధారాలుగా ఛార్జ్‌షీట్‌లో చేర్చారు. ముగ్గురు బాలురను మేజర్లుగా పరిగణించి విచారించాలని ప్రాసిక్యూషన్‌ కోరగా, 13 ఏళ్ల బాలికపై జువైనల్‌ జస్టిస్‌ బోర్డులోనే విచారణ కొనసాగనుంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్