Magazines

నగరంలో వరుస అగ్నిప్రమాదాలు.. భారీగా ఆస్తి నష్టం

2 గంటల క్రితం

A series of fires in the city... Massive property damage
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – హైదరాబాద్‌: కూకట్‌పల్లిలోని ఆస్బెస్టాస్‌ కాలనీలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. పేపర్‌ టీ కప్పులు, ప్లేట్ల తయారీ కంపెనీలో చెలరేగిన మంటలు సమీపంలోని నెయ్యి, కుర్‌కురే, హల్దీరామ్‌ స్టాక్‌ గోదాములకు వ్యాపించాయి. నాలుగు ఫైర్‌ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.

నగరంలోని బేగంబజార్‌, జీడిమెట్ల, మైలార్‌దేవ్‌పల్లి, సికింద్రాబాద్‌ బండిమెట్‌లోనూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. బేగంబజార్‌, జీడిమెట్లలో బాణసంచా కారణంగా మంటలు వ్యాపించగా, ఇతర ప్రాంతాల్లో గోదాములు, దుకాణాల్లో అగ్నిప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్