నవతెలంగాణ - హైదరాబాద్ : ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు కీలక ప్రకటన చేసింది. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 15 వరకు పలు నిబంధనలను దశలవారీగా మార్చనుంది. అంతర్జాతీయ లావాదేవీల ఛార్జీలు, కార్డు రీప్లేస్‌మెంట్ ఫీజు, ఇన్సూరెన్స్, సినిమా టికెట్ ప్రయోజనాలపై ఈ మార్పులు ప్రభావం చూపనున్నాయి.
నవంబర్ 25 నుంచి కొన్ని బిజినెస్, కార్పొరేట్ కార్డులపై డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ (DCC) ఛార్జీని 1 శాతం నుంచి 3.50 శాతానికి పెంచనుంది. ఈ మార్పు బిజినెస్ బ్లాక్ అడ్వాంటేజ్, బిజినెస్ బ్లూ అడ్వాంటేజ్, ట్రావెల్ ఏజెంట్, బిజినెస్ ప్లాటినం కార్డులకు వర్తించనుంది. అలాగే డిసెంబర్ 11 నుంచి క్రెడిట్ కార్డు రీప్లేస్‌మెంట్ ఛార్జీని రూ.200 నుంచి రూ.300కు పెంచనుంది. దీనికి జీఎస్టీ అదనం. అయితే ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్, 1838 రిజర్వ్, టైమ్స్ బ్లాక్ కార్డులకు ఈ ఛార్జీ నుంచి మినహాయింపు ఉన్నట్లు సమాచారం.






కామెంట్‌లు (0)