Magazines

తెలంగాణ రక్షణ సేన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకాశ్ కొల్లూరు

2 గంటల క్రితం

Akash Kollur is the Telangana Defence Force Graduate MLC candidate.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌ : రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే తమ పార్టీ అభ్యర్థులను తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. హైదరాబాద్‌–రంగారెడ్డి–మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఆకాశ్ కొల్లూరును అభ్యర్థిగా ఖరారు చేశారు.

ఇప్పటికే వరంగల్‌–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి బీసీ వర్గానికి చెందిన నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను ప్రకటించిన కవిత, తాజాగా రెండో స్థానానికి కూడా బీసీ సామాజికవర్గానికి చెందిన ఆకాశ్ కొల్లూరుకు అవకాశం కల్పించారు. దీంతో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లోనూ బీసీ అభ్యర్థులను బరిలోకి దింపినట్లయింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్