Magazines

పదో తరగతి విద్యార్థులకు అలర్ట్‌..గడువు పొడిగింపు

20 నిమిషాల క్రితం

10th class student
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు (ఎస్‌ఎస్‌సీ 2027) రాయబోయే విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ కీలక సమాచారం అందించింది. పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తూ, సవరించిన నూతన షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఫీజు చెల్లింపు ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించింది.

సవరించిన షెడ్యూల్ ప్రకారం.. ఎలాంటి ఆలస్య రుసుము (లేట్ ఫీజు) లేకుండా నవంబర్ 26 వరకు పరీక్ష ఫీజును చెల్లించవచ్చు. ఆ గడువు ముగిసిన తర్వాత రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 8 వరకు అవకాశం కల్పించారు. రూ.200 అపరాధ రుసుముతో డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 21 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 23 నుంచి జనవరి 4 వరకు ఫీజు చెల్లించేందుకు వెసులుబాటు కల్పించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్