నవతెలంగాణ-హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి తుఫాన్‌గా రూపాంతరం చెందింది. ఈ తుఫాన్‌కు అక్వాన్ అని నామకరణం చేశారు. ఇది ప్రస్తుతం సముద్రంలో కదులుతూ ఏపీ వైపునకు పయనిస్తోంది. భారత వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. ఈ తుఫాన్ ప్రస్తుతం తీరానికి దూరంగా సముద్రంలో చెన్నైకి 610 కి.మీ. దూరంలో, మచిలీపట్నానికి 660 కి.మీ. దూరంలో, విశాఖపట్నానికి 670 కి.మీ. దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది.
ఈ ‘ఆక్వాన్’ తుఫాన్ రానున్న రోజుల్లో మరింత శక్తివంతంగా మారనుంది. ఇది నవంబర్ 19 నటికి మరో మూడు రోజుల్లో మరింత బలపడి తీవ్ర తుఫాన్‌గా మారనుంది. ఈనెల 20న నెల్లూరు - తుని మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాన్ ప్రభావం కారణంగా నవంబర్ 18 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం పూర్తిగా మారనుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో పాటు ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున, మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే తీరప్రాంత ప్రజలు, రైతులు తగిన ముందస్తు జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.







కామెంట్లు (0)