Magazines

వైభవ్‌ సూర్యవంశీకి ఖరీదైన గిఫ్ట్‌..

4 గంటల క్రితం

Another expensive gift for Vaibhav Suryavanshi..
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : 15 ఏళ్ల వయసులోనే క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న బిహార్‌ కుర్రాడు వైభవ్‌ సూర్యవంశీకి మరో ఖరీదైన బహుమతి లభించింది. ఐపీఎల్‌ 2026లో ‘సూపర్‌ స్ట్రైకర్‌ ఆఫ్‌ ది సీజన్‌’ అవార్డు గెలుచుకున్న అతడికి ప్రకటించిన టాటా సియెర్రా ఎస్‌యూవీ ఎట్టకేలకు అందింది. కుటుంబ సభ్యులతో కలిసి కొత్త కారుతో దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.


ఐపీఎల్‌ 2026లో వైభవ్‌ 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు అర్ధశతకాలు, ఒక సెంచరీ ఉన్నాయి. 63 ఫోర్లు, 72 సిక్సర్లతో ఆకట్టుకున్న అతడు ఆరెంజ్‌ క్యాప్‌తో పాటు సూపర్‌ స్ట్రైకర్‌ అవార్డును సొంతం చేసుకున్నాడు. గతంలోనూ ఐపీఎల్‌ 2025లో సూపర్‌ స్ట్రైకర్‌ అవార్డుకు టాటా కర్వ్‌ ఈవీని బహుమతిగా అందుకున్నాడు. 2025లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన వైభవ్‌.. ఈ ఏడాది ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం సీనియర్‌ బిహార్‌ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికై సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో జట్టును నడిపించనున్నాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్