Magazines

ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టులో వాదనలు

3 గంటల క్రితం

Arguments in the Supreme Court regarding Delhi's pollution
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష‍్యంతో దేశరాజధాని ఢిల్లీలో రోజురోజుకు కాలుష్య పెరిగిపోతుంది. ఎన్నికల ముందు రాజధానిలో కాలుష్యం పూర్తిగా కట్టడి చేస్తామని ప్రగల్భాలు పలికిన రేఖాగుప్తా ప్రభుత్వం ఆచరణలో విఫలమైంది. తాజాగా ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి.



పంట వ్య‌ర్ధాల‌ను సేక‌రించే విధానాన్ని, ధ‌ర‌ను ముందే ప్ర‌క‌టించాల‌ని సుప్రీంకోర్టు చెప్పింది. దీనికి సంబంధించిన మేనేజ్మెంట్ వ్య‌వ‌స్థ‌ను రూపొందించాల‌ని పేర్కొన్న‌ది. చీఫ్ జ‌స్టిస్ సూర్య‌కాంత్‌, జ‌స్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, వీ మోహ‌న‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసులో వాద‌న‌లు విన్న‌ది.


అయితే బెంచ్ ముందు సీనియ‌ర్ లాయ‌ర్ అప‌రాజిత సింగ్ రియాక్ట్ అవుతూ.. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలోనే ఉంద‌న్నారు. త‌న గొంతుపై ఆ ప్ర‌భావం ఉన్న‌ట్లు ఆమె చెప్పారు.ఈ ప్రాంతంలో గాలి పీల్చ‌డం అంటే రోజుకు 30 సిగ‌రెట్లు తాగిన‌దానితో స‌మానం అవుతుంద‌ని ఆమె అన్నారు. వ‌ర్షం వ‌ల్ల కూడా కాలుష్యం కాస్త త‌గ్గిన‌ట్లు చెప్పారు. వ‌చ్చే సీజ‌న్ కోసం రైతులు ప్రిపేర్ కావ‌డం వ‌ల్ల పంట వ్యర్ధాల‌ను కాల్చ‌డం కూడా ఆగిన‌ట్లు తెలుస్తోంద‌ని సుప్రీం తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్