Magazines

చేవెళ్లలో ఆర్మీ వాహనం బోల్తా

1 గంట క్రితం

Army vehicle overturns in Chevella
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని అల్లా వాడ గేట్ సమీపంలో ఆర్మీ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగిన సమయంలో వాహనంలో 14 మంది ఉన్నట్లు సమాచారం. వారిలో ఎనిమిది మందికి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్మీ ట్రైనింగ్‌లో భాగంగా గోల్కొండ ఆర్మీ క్యాంపు నుంచి షాబాద్‌కు ట్రైనింగ్‌ కోసం వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్