Magazines

సీజేపీ ముఖ్య నేతల అరెస్ట్..అభిజీత్ దీప్కే కీలక నిర్ణయం

14 అక్టోబర్, 2026

cjp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కార్యకర్త అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. డీనోటిఫై చేసిన జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు ఆందోళన నిర్వహించారని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ లను నిరసిస్తూ అక్టోబర్ 16న కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి ప్రజలు తరలి రావాలని సీజేపీ అధినేత అభిజిత్ దీప్కే పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా తెలియజేశారు. "లెహ్రా దో తిరంగా" దేశభక్తులు, త్రివర్ణ పతాకాన్ని ప్రేమించే ప్రజలు అక్టోబర్ 16న సాయంత్రం 5 గంటలకు పార్కులో సమావేశమై జాతీయ జెండాను ఎగురవేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.





ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్