నవతెలంగాణ-హైదరాబాద్ : ఆసియా పారా గేమ్స్‌లో భారత్ పతకాల వేట మొదలైంది. షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్ 1 విభాగంలో భారత్‌కు చెందిన ఇద్దరు షూటర్లు ఫైనల్‌లో తలపడ్డారు. అందులో మోనా అగర్వాల్ విజేతగా నిలిచి స్వర్ణం కైవసం చేసుకుంది. కేవలం 0.4 పాయింట్ల తేడాతో అవని లేఖర రజతంతో సరిపెట్టుకుంది. మోనా మొత్తం 250పాయింట్లు సాధించగా.. అవని 249.6 పాయింట్లు రాబట్టింది. ఇక దక్షిణ కొరియాకు చెందిన లీ యున్రి (227.9) మూడో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకుంది. పురుషుల జూడో 70 కేజీల జే1 విభాగంలో కపిల్ పర్మార్ కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. కాంస్య పోరులో ఇండోనేషియాకు చెందిన అహ్నాఫ్ రఫ్లిపై కపిల్ విజయం సాధించాడు. అంతకుముందు సెమీస్‌లో ఇండోనేషియాకు చెందిన జునాయిది చేతిలో 0-1 తేడాతో కపిల్ ఓటమిని చవిచూశాడు.
Asian Para Games 2026: షూటింగ్‌లో భారత్‌కు బంగారు పతకం
19 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 19, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)