నవతెలంగాణ-హైదరాబాద్:
భారత పారా అథ్లెట్ దీప్తి జీవన్‌జీ స్వర్ణం కైవసం చేసుకుంది. మంగళవారం ఆసియా పారా గేమ్స్‌లో- 2026 మహిళల 400 మీటర్ల టీ20 ఈవెంట్‌లో 56.36 సెకన్ల సమయంతో కొత్త రికార్డును నెలకొల్పి స్వర్ణం కైవసం చేసుకున్నారు. తన సమీప ప్రత్యర్థి జపాన్ క్రీడాకారిణి నీనా కన్నో కంటే 58.92 ఆధిక్యంతో ఆమె రేసును ముగించారు. జీవన్‌జీ సాధించిన ఈ పతకంతో భారతదేశానికి ఇది ఐదో స్వర్ణ పతకం కాగా, పారా ఆసియా గేమ్స్ రెండో రోజు ఇదే తొలి పతకం. పారిస్ 2024 పారాలింపిక్స్ కాంస్య పతక విజేత అయిన జీవన్‌జీ, ఈ రేసులో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.







కామెంట్‌లు (0)