Magazines

ఆసియా పారా క్రీడలు: మహిళల 100 మీటర్ల భారత్ కు రజతం

21 అక్టోబర్, 2026

Asian Para Games
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: ఆసియా పారా క్రీడల్లో భాగంగా బుధవారం జరిగిన మహిళల 100 మీటర్ల T35 విభాగంలో భారత పారాలింపిక్ పతక విజేత ప్రీతి పాల్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ప్రీతి ఈ దూరాన్ని 13.98 సెకన్లలో పూర్తి చేశారు. చైనాకు చెందిన ప్రపంచ రికార్డు హోల్డర్ జౌ షియా స్వర్ణ పతకం సాధించారు.


అంతకుముందు, బుధవారమే జరిగిన మహిళల 200 మీటర్ల T35 ఫైనల్‌లో కూడా ప్రీతి రజత పతకాన్ని గెలుచుకున్నారు. దీంతో ఈ క్రీడల్లో భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 48కి చేరింది. ఇందులో 12 స్వర్ణాలు, 18 రజతాలు,18 కాంస్య పతకాలు ఉన్నాయి. అలాగే, పారా-పవర్‌లిఫ్టింగ్‌లో మహిళల 67 కేజీల విభాగంలో కస్తూరి రాజామణి రజత పతకాన్ని సాధించి, భారత్‌కు మరో పతకాన్ని అందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్