Magazines

హైదరాబాద్‌లో ఆటోల సమ్మె..నవంబర్ 30న బంద్‌కు పిలుపు

51 నిమిషాల క్రితం

auto strike
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : హైదరాబాద్ లో నవంబర్ 30న ఆటోల బంద్‌కు మహాత్మా గాంధీ తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ పిలుపునిచ్చింది. పెంచిన ఆటో మీటర్ చార్జీలను వెంటనే అమలు చేయాలని, గ్రీన్ క్యాబ్‌లను నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఈ సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించింది. 15 రోజుల్లో తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే బంద్ ఖాయమని, అప్పటికీ స్పందించకపోతే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన పదవికి రాజీనామా చేయాలని హెచ్చరించింది.

హైదర్‌గూడలో నేడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ కన్వీనర్ మహమ్మద్ అమానుల్లా ఖాన్ మాట్లాడారు. ప్రభుత్వం గ్రీన్ క్యాబ్‌లకు అనుమతి ఇవ్వడం వల్ల ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల ఉపాధి దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీన్ క్యాబ్‌లను తక్షణమే నిషేధించడంతో పాటు బెంగళూరులో మాదిరిగా నగరంలో బైక్ ట్యాక్సీలను రద్దు చేయాలని కోరారు.

ఆటో డ్రైవర్లకు గతంలో హామీ ఇచ్చిన ప్రకారం, ఏడాదికి రూ. 12,000 చొప్పున మొత్తం రూ. 36,000 బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇటీవల దుండగుల దాడిలో మరణించిన ఆటో డ్రైవర్ మహమ్మద్ ముకరం కుటుంబానికి ప్రభుత్వం రూ. 10 లక్షల పరిహారం అందించాలని కోరారు.

ఇటీవల ప్రభుత్వం ఆటో కనీస చార్జీని 1.6 కిలోమీటర్లకు రూ. 30గా, ఆ తర్వాత ప్రతి కిలోమీటర్‌కు రూ. 14గా నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, ఈ చార్జీలు ఇంకా అమలులోకి రాకపోవడంతో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్