Magazines

శంషాబాద్‌ విమానాశ్రయంలో ఎయిర్‌ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం

5 రోజుల క్రితం

Air India
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్‌ఇండియా విమానం అత్యవసరంగా ల్యాండింగ్‌ అయ్యింది. హైదరాబాద్‌ నుంచి 109 మంది ప్రయాణికులతో ముంబయికి బయలుదేరిన ఏఐ417 విమానంలో టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే సాంకేతికలోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలట్‌ ఏటీసీకి సమాచారం అందించి, వారి సూచనల మేరకు 5 నిమిషాల్లోనే విమానాన్ని తిరిగి శంషాబాద్‌ విమానాశ్రయంలో సురక్షితంగా దించారు. ఈ ఘటనతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా, సాంకేతిక బృందం విమానాన్ని పరిశీలిస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్