నవతెలంగాణ - హైదరాబాద్ : 2018 దక్షిణాఫ్రికా పర్యటనలో చోటుచేసుకున్న బాల్ టాంపరింగ్ వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. మాజీ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా తన రాబోయే పుస్తకంలో సంచలన విషయాలు వెల్లడించాడు. ఆస్ట్రేలియా జట్టులోని అందరికీ బాల్ టాంపరింగ్ గురించి తెలుసని, అయితే అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, కామెరూన్ బాన్క్రాఫ్ట్లనే బాధ్యులుగా చేశారని పేర్కొన్నాడు. ఖవాజా వ్యాఖ్యలకు వార్నర్ మద్దతు పలుకగా, బౌలర్ మిచెల్ స్టార్క్ మాత్రం ఖండించాడు. విచారణ సరిగా జరగలేదని వార్నర్ విమర్శించగా, మైదానంలో తమకు ఈ వ్యవహారం గురించి తెలియదని స్టార్క్ స్పష్టం చేశాడు. కాగా, 2018లో కేప్‌టౌన్ టెస్టులో బాన్‌క్రాఫ్ట్ సాండ్‌పేపర్‌తో బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తూ కెమెరాలకు చిక్కాడు. దీంతో బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలలు, స్మిత్, వార్నర్‌లపై ఏడాది పాటు క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించింది.
బాల్ టాంపరింగ్ వివాదం.. ఖవాజాకు వార్నర్ మద్దతు!
58 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)