నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్లో ఖరీదైన బ్రాండ్ల పేరుతో చీప్ లిక్కర్ విక్రయిస్తున్న ముఠా గుట్టును ఎక్సైజ్ పోలీసులు రట్టు చేశారు. శంషాబాద్ శాతంరాయికి చెందిన అశోక్, యాకూబ్ పాషాను అరెస్ట్ చేశారు. అశోక్ ఇంట్లో తనిఖీలు చేసి మిక్సింగ్ చేసిన 10 ఫుల్ బాటిళ్లు, 30కి పైగా ఖాళీ బ్రాండెడ్ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. యాకూబ్ పాషా స్క్రాప్ దుకాణం నుంచి ఖాళీ సీసాలు తెచ్చినట్లు గుర్తించారు. ఇప్పటివరకు పది మందికి కల్తీ మద్యం విక్రయించినట్లు విచారణలో వెల్లడైంది. కొనుగోలుదారులు, ఈ దందా వెనుక ఉన్న ఇతర వ్యక్తులపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం ప్రియులకు బిగ్ అలర్ట్..బ్రాండెడ్ బాటిళ్లలో చీప్ లిక్కర్
12 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 18, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్లు (0)