Magazines

ఆసీస్‌పై బవుమా చారిత్రాత్మక శతకం..

1 గంట క్రితం

Bavuma's historic century against the Aussies..

Bavuma's historic century against the Aussies..

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ టెంబా బవుమా అద్భుతంగా రాణించాడు. గ్గెబెర్హా వేదికగా మూడో రోజు ఆటలో 179 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును ఆదుకున్నాడు. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ పేరిట ఉన్న 28 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఆటలో స్కాట్‌ బోలాండ్‌ దెబ్బకు దక్షిణాఫ్రికా టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో బవుమా బాధ్యతాయుతంగా ఆడుతూ రియాన్‌ రికెల్టన్‌, మార్కో జాన్సెన్‌, సైమన్‌ హార్మర్‌లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అతడి పోరాటంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ను 425/9 వద్ద డిక్లేర్‌ చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్