Magazines

టీజీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు దసరా పండుగ అడ్వాన్స్..

6 గంటల క్రితం

money
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : దసరా పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తన ఉద్యోగులకు శుభవార్త అందించింది. సంస్థ ఎండీ నాగిరెడ్డి ఆదేశాల మేరకు.. అర్హులైన క్లాస్ 3, క్లాస్ 4 స్థాయి ఉద్యోగులకు పండుగ అడ్వాన్స్ అందించాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ అడ్వాన్స్ మొత్తాన్ని అనుబంధ వేతన బిల్లు ద్వారా వెంటనే చెల్లించాలని అధికారులకు సూచించారు. తీసుకున్న అడ్వాన్స్ మొత్తాన్ని ఎలాంటి వడ్డీ లేకుండా, 10 సమాన వాయిదాల (EMI) పద్ధతిలో ఉద్యోగుల వేతనాల నుండి తిరిగి రికవరీ చేయనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్