Magazines

వరుసగా నాలుగోరోజు తగ్గిన బంగారం ధర..

42 నిమిషాల క్రితం

gold
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : వరుసగా నాలుగోరోజు బంగారం ధరలు పతనమయ్యాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో శుక్రవారం ఉదయం 10 గంటలకు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1900 మేర తగ్గి.. రూ.1,42,480కి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1750 తగ్గి.. రూ.1,30,060కి చేరింది. వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,25,000గా కొనసాగుతోంది. తగ్గిన ధరలకు జీఎస్టీ, తరుగు అదనంగా ఉంటుంది. మరికొద్దిరోజుల్లో ధన్ తేరస్, దీపావళి పండుగలు వస్తుండటంతో.. మార్కెట్లో బంగారం కొనుగోళ్లు నెమ్మదిగా పుంజుకుంటున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్