Magazines

ఉత్తరప్రదేశ్‌ ఓటర్ల జాబితాలో అక్రమాలు

1 గంట క్రితం

Akhilesh Yadav
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 1 నిమిషాల చదవడం

- సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్

నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ఒక మహిళ పేరు పలు చోట్ల నమోదైందని ఆయన పేర్కొన్నారు. 2027 అసెంబ్లీ ఎన్నికలకు ముందు "ఓట్ల దొంగతనం" జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు. సోమవారం నాడు లక్నోలో విలేకరులతో మాట్లాడిన యాదవ్.. సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్త సచిన్ ఓటర్ల జాబితాను పరిశీలించగా, 'ఫూల్‌మతి సూరజ్' అనే మహిళ పేరు పలు చోట్ల కనిపించిందని తెలిపారు. ఇటువంటి లోపాలను ఎన్నికల సమయంలో దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని బూత్ స్థాయి అధికారి (BLO) దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. నకిలీ నమోదులను తొలగిస్తారని ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన, ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల అక్రమాలు జరగకుండా చూడాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్