నవతెలంగాణ - హైదరాబాద్: సుప్రసిద్ధ సాహితీవేత్త, ఆచార్య ముదిగొండ శివప్రసాద్ (86) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం రాత్రి కన్నుమూశారు. తన కలం బలంతో గత వైభవంలోకి, చరిత్ర పుటల్లోకి విహరింపజేసిన ఆయన నిష్క్రమణ సాహితీ లోకానికి తీరని లోటు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ ఆంధ్ర మహిళాసభ దుర్గాబాయి దేశ్ముఖ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి 8.30 గంటలకు గుండెపోటుతో కన్నుమూశారు.
1940లో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలం, ఆకుల అల్లూరులో జన్మించారు. ఆయన సతీమణి డా.ఉమాదేవి చాలా ఏళ్ల క్రితం పరమపదించారు. వారికి కుమారుడు ఇందు శేఖర్, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.







కామెంట్లు (0)