నవతెలంగాణ హైదరాబాద్:దసరా సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన పాలపిట్టలను బోనుల్లో బంధించి,రెక్కలు కత్తిరించి వ్యాపారం చేయడం చట్టరీత్యా నేరమని హైదరాబాద్ సీపీ సజ్జనర్ హెచ్చరించారు. మూగజీవాల స్వేచ్ఛను హరించి వాటిని హింసిస్తే ఎవరికీ మేలు జరగదని,వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972ప్రకారం పాలపిట్టలను బంధించడం,విక్రయించడం శిక్షార్హమని ఆయన తెలిపారు.కాబట్టి పండుగ వేళ మూగజీవాలకు స్వేచ్ఛను ప్రసాదించి,అటువంటి ప్రదర్శనలను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించవద్దని కోరారు.ఎక్కడైనా పాలపిట్టలను బంధించినట్లు సమాచారం తెలిస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్లు 1800 4255364, 98033 38666లేదా డయల్ 112కు సమాచారం అందించి బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు :సీపీ సజ్జనర్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 20, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్లు (0)