నవతెలంగాణ - హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ చరిత్రలో నవంబర్ 29కి ప్రత్యేక స్థానం ఉంది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు నాంది పలికిన ఈ రోజును పురస్కరించుకుని, ఆయన అరెస్టయిన అల్గునూరు చౌరస్తాలో బీఆర్‌ఎస్ దీక్షా దివస్ స్ఫూర్తి బహిరంగ సభ నిర్వహించనుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి ప్రజలు, ఉద్యమకారులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు.
నేడు అలుగునూరులో బీఆర్‌ఎస్ 'దీక్షా దివస్' స్ఫూర్తి సభ
35 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 29, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)