నవతెలంగాణ – హైదరాబాద్ : కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ ఇన్‌గేట్ సమీపంలో అర్ధరాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది. షాబాద్‌కు చెందిన మడ్డి సుధాకర్ అలియాస్ సిద్దు హత్యకు గురయ్యాడు. అశోక్‌నగర్‌కు చెందిన ఇబ్రహీం బేగ్ బండరాయితో మోది అతడిని హత్య చేసినట్లు సమాచారం. మృతుడు స్థానికంగా ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో పనిచేస్తున్నట్లు తెలిసింది. మద్యం మత్తులో జరిగిన గొడవ హత్యకు కారణమా? లేక పాత కక్షలతో ఈ ఘటన జరిగిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద దారుణ హత్య
17 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 06, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)