Magazines

చంచల్‌గూడ స్టీల్‌బ్రిడ్జిపై రోడ్డుప్రమాదం.. విద్యార్థి మృతి

18 అక్టోబర్, 2026

Accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: చంచల్‌గూడ స్టీల్‌ బ్రిడ్జిపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో చాకలి పవన్‌ (20) అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రగాయాల పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని పల్టాన్ ప్రాంతానికి చెందిన పవన్‌ (విద్యార్థి)తో పాటు మరో వ్యక్తి కలిసి ద్విచక్ర వాహనంపై స్టీల్‌బ్రిడ్జిపై వెళ్తుండా టిప్పర్‌ను ఓవర్‌టేక్‌ చేయబోయి, నియంత్రణ కోల్పోయి మరో వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో నవీన్‌ ప్రాణాలు కోల్పోగా..తీవ్రగాయాల పాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్