నవతెలంగాణ - హైదరాబాద్ : న్యూజిలాండ్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు భారత జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. యువ పేసర్ గుర్నూర్ బ్రార్‌కు సెలక్టర్లు అవకాశం కల్పించారు. దీంతో ఆదివారం జరిగే చివరి వన్డేకు అతడు దూరం కానున్నాడు. మరోవైపు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను టెస్టు జట్టు నుంచి విడుదల చేశారు. దేశవాళీ క్రికెట్‌లో ఉత్తరప్రదేశ్ తరఫున ఆడేందుకు అనుమతించారు. ఈ విషయాలను బీసీసీఐ శనివారం వెల్లడించింది. నవంబర్ 19 నుంచి వెల్లింగ్టన్‌లో ప్రారంభమయ్యే తొలి టెస్టు కోసం గుర్నూర్ నేరుగా జట్టుతో చేరనున్నాడు. వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఇప్పటికే జట్టుతో కలిశాడు. వన్డే సిరీస్ ముగిసిన అనంతరం భారత్, న్యూజిలాండ్ జట్లు రెండు టెస్టుల్లో తలపడనున్నాయి.
భారత టెస్టు జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, అన్షుల్ కాంబోజ్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, సాయి సుదర్శన్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్.






కామెంట్‌లు (0)