Magazines

తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు

2 గంటల క్రితం

Chicken prices drop in Telugu states
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో చికెన్‌, కోడిగుడ్ల ధరలు భారీగా తగ్గాయి. గత వారం కిలో చికెన్‌ ధర రూ.300 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.250కి పడిపోయింది. కార్తీక మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో డిమాండ్‌ తగ్గడంతో ధరలు దిగివచ్చాయని వ్యాపారులు తెలిపారు. హైదరాబాద్‌లో స్కిన్‌లెస్‌ చికెన్‌ కిలో రూ.252గా, విజయవాడలో రూ.266గా నమోదైంది. కోడిగుడ్ల ధర సైతం డజనుకు రూ.80కి తగ్గింది. రానున్న రోజుల్లో డిమాండ్‌ మరింత తగ్గితే చికెన్‌, కోడిగుడ్ల ధరలు ఇంకాస్త దిగివచ్చే అవకాశం ఉందని పౌల్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్