Magazines

తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు..

5 గంటల క్రితం

chciken-prices
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : కార్తీక మాసం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు కొంతవరకు తగ్గుముఖం పట్టాయి. గత వారంతో పోలిస్తే కిలో చికెన్ ధరపై రూ.50 నుండి రూ.80 వరకు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.260-270గా ఉండగా, వరంగల్‌లో రూ.250-260గా ఉంది. నిజామాబాద్‌లో రూ.200 నుంచి రూ.260, కామారెడ్డిలో రూ.260 వరకు విక్రయిస్తున్నారు. అటు విజయవాడలో రూ.220-230, ప్రకాశం జిల్లాలో రూ.260, నంద్యాల జిల్లాలో రూ.240-250, విశాఖ, అనకాపల్లిలో రూ.220 వరకు అమ్ముతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్