Magazines

మహారాష్ట్ర సీఎంతో ముఖ్యమంత్రి రేవంత్ ‌రెడ్డి భేటీ

6 గంటల క్రితం

maharashtra
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్‌తో తెలంగాణ సిఎం రేవంత్ ‌రెడ్డి సోమవారం భేటీ అయ్యారు. ముంబయిలోని సహ్యాద్రి స్టేట్‌ గెస్ట్‌హౌస్‌లో వీరి సమావేశం జరిగింది. ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రాణహిత నదిపై నిర్మించనున్న తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు ఖరారు అంశంపై ఫడణవీస్‌తో రేవంత్‌ చర్చిస్తున్నారు. ఈ భేటీలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సిఎస్‌ సంజయ్‌ జాజు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తుమ్మడిహెట్టిపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రజంటేషన్‌ ఇచ్చారు. గతంలో మహారాష్ట్ర అంగీకరించిన 148 మీటర్ల వద్ద ఏ మేరకు ముంపు ఏర్పడుతుంది ? ఎంత నీరు తరలించేందుకు వీలుంటుంది ? 152 మీటర్ల వద్ద నిర్మిస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే దానిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్‌ వివరించనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్