Magazines

సీజేపీ అధినేత అభిజీత్ దీప్కే అరెస్ట్

16 అక్టోబర్, 2026

Abhijit Deepke
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: సీజేపీ అధినేత అభిజీత్ దీప్కేను బలవంతంగా ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో తలపెట్టిన ‘లెహ్రా దో తిరంగా’ నిరసన ర్యాలీకి అనుమతి లేదని, కన్నాట్ ప్లేస్‌లో సెక్షన్ 163 అమలులో ఉందని తెలియజేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని పలు రోజులుగా ఢిల్లీలో ప్రతిపక్షాలతో పాటు సీజేపీ, పలు పౌర సంఘాలు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియలో భారీ యోత్తున అవకతవకలు జరగాయని, సీఈసీ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా విపక్షాలు నిరసనలు నిర్వహిస్తున్నాయి.


మరోవైపు శాంతియుత నిరసనలను అడ్డుకోవడానికి మోడీ ప్రభుత్వం అనేక ఆంక్షలు విధిస్తోంది. ఇండియా బ్లాక్ కూటమి నేతలతో పాటు అనేక మంది ముఖ్యనేతలను, విద్యార్థి నాయకులను, పౌర సంఘాల నేతలను ఢిల్లీ పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేస్తున్నారు. నిరసన ప్రాంతాలకు యువత తరలివెళ్లకుండా భద్రతా బలగాలు అనేక అడ్డంకులు సృష్టస్తున్నాయి. తాజాగా సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని సీజేపీ తలపెట్టిన లెహ్రంగ తిరంగ ర్యాలీకి అనుమతి ఇవ్వకుండా ఢిల్లీ పోలీసులు ఆంక్షలు విధించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్