Magazines

దీపావళి వరకు సీజేపీ ఆందోళనలకు బ్రేక్‌!

21 అక్టోబర్, 2026

CJP protests on hold until Diwali!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన ఆందోళనలను దీపావళి వరకు తాత్కాలికంగా విరమించాలని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. పండుగ సమయంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని సూచించారు. నిరసనల్లో పాల్గొంటున్న యువత క్షేమంపై వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న పార్టీ నేతలు సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ కుటుంబాలు కూడా ఆవేదనలో ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు, ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో దసరా సందర్భంగా రావణుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తుల దిష్టిబొమ్మలతో పాటు 30 అడుగుల బొద్దింక బొమ్మను కూడా దహనం చేయనున్నారు. స్వచ్ఛ భారత్‌, స్వచ్ఛ ఢిల్లీ కార్యక్రమాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రామ్‌లీలా కమిటీ వెల్లడించింది. దీనిపై అభిజీత్‌ దీప్కే వ్యంగ్యంగా

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్