నవతెలంగాణ-హైదరాబాద్: రాష్ట్రంలో పరిస్థితులు ఎంతో మారిపోయాయని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. బుధవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గతంలో కర్రెగుట్టల వంటి ప్రాంతాలకు వెళ్లడం కష్టంగా ఉండేదని, ఇప్పుడు స్వేచ్ఛగా వెళ్లగలుగుతున్నామని తెలిపారు. ఒకప్పుడు ఏడాదిలో అమరులైన పోలీసుల జాబితా పెద్దగా ఉండేదని, ప్రస్తుతం పరిస్థితి మారిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో నక్సలిజం సమస్య తగ్గిందన్నారు. పోలీసుల సంక్షేమానికి అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో పరిస్థితులు మారాయి : డీజీపీ
21 అక్టోబర్, 2026

Conditions have changed in the state: DGP
వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 21, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)