Magazines

పోలీసులకు డీజీపీ వార్నింగ్‌

17 అక్టోబర్, 2026

DGP CV Anand
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: తెలంగాణలో పోలీస్ సిబ్బంది యూనిఫామ్‌లో డ్యాన్సులు చేయడంపై రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ తీవ్రంగా స్పందించారు. ఇకపై యూనిఫామ్‌ ధరించి వినోద కార్యక్రమాల్లో పాల్గొన్నా, డ్యాన్సులు చేసినా కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఆయన శుక్రవారం హెచ్చరించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పోలీస్ యూనిట్ల అధిపతులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.

ఇటీవల కాలంలో పలువురు పోలీసు సిబ్బంది, అధికారులు పండుగలు, ప్రైవేట్ కార్యక్రమాల్లో యూనిఫామ్‌లోనే డ్యాన్సులు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గణేశ్ నిమజ్జనం, మేడారం జాతర, వీడ్కోలు సమావేశాలు వంటి సందర్భాల్లో జరిగిన ఈ ఘటనలు పోలీసు శాఖ క్రమశిక్షణపై ప్రజా విమర్శలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో డీజీపీ తాజా ఆదేశాలు జారీ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్