Magazines

పేదల సొంతింట్లో దీపావళి వెలుగులు.. లబ్ధిదారులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి

4 గంటల క్రితం

Diwali lights in the homes of the poor; Minister Ponguleti joins beneficiaries in the celebrations

Diwali

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – హైదరాబాద్: సొంతింటి కల నెరవేరడంతో పేద కుటుంబాల్లో ఈ దీపావళి మరింత ఆనందాన్ని నింపిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్‌ మండలం కామంచికల్‌ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి ఆయన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో ముచ్చటించి, నూతన వస్త్రాలు అందజేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీకలని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి విడతల వారీగా ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.


రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 8 లక్షల ఇళ్లు మంజూరు చేయగా, మొదటి విడతలో మంజూరైన వాటిలో 2,21,500 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని వెల్లడించారు. కుల, మత, రాజకీయ భేదాలు లేకుండా అర్హులకు ఇళ్లు కేటాయిస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.40 వేల కోట్ల నిధులు కేటాయించామని, త్వరలో మూడు, నాలుగో విడతల్లోనూ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి వెల్లడించారు. అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా పథకాన్ని అమలు చేస్తూ పేదల సొంతింటి కలను నెరవేరుస్తామని స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్