Magazines

భగ్గుమంటున్న గుడ్ల ధరలు.. డజను రూ.96కు చేరిక!

1 గంట క్రితం

Egg prices soar—reaching Rs 96 per dozen!
avatar
Kalluri Elender

ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఒక్కసారిగా పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో డజను గుడ్లు రూ.75 నుంచి రూ.80 వరకు ఉండగా, నాలుగైదు రోజుల క్రితం రూ.90కి చేరాయి. ప్రస్తుతం ఏకంగా రూ.96కు పెరిగాయి. దీంతో ఒక్కో గుడ్డు ధర రూ.8కు చేరింది. కొద్ది రోజుల వ్యవధిలోనే డజనుపై రూ.16 వరకు ధర పెరగడంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు గుడ్ల ధరల పెరుగుదల మరింత భారంగా మారింది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్