Magazines

రాంగ్‌ రూట్‌లో బైక్‌.. ఇంజినీరింగ్‌ విద్యార్థిని దుర్మరణం!

11 నవంబర్, 2026

bank
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : హైదరాబాద్‌లో రాంగ్‌ రూట్‌లో బైక్‌ నడిపిన ఓ ఎస్బీఐ ఉద్యోగి నిర్లక్ష్యం కారణంగా 21 ఏళ్ల ఇంజినీరింగ్‌ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. తండ్రితో కలిసి కళాశాలకు వెళ్తున్న యువతి.. ఎదురుగా వేగంగా వచ్చిన బైక్‌ను తప్పించే క్రమంలో ఆర్టీసీ బస్సు కిందపడి మృతి చెందింది. ఈ ఘటన నల్లకుంట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. పాతబస్తీకి చెందిన షేక్‌ ఆయిషా ముస్ఫిరా ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో మైనింగ్‌ విభాగంలో మూడో సంవత్సరం చదువుతోంది. సోమవారం ఉదయం తండ్రి ఆరీఫ్‌తో కలిసి బైక్‌పై కళాశాలకు వెళ్తుండగా ఫీవర్‌ ఆసుపత్రి సిగ్నల్‌ సమీపంలో ఎదురుగా రాంగ్‌ రూట్‌లో వచ్చిన మరో బైక్‌ను తప్పించే క్రమంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆయిషా ప్రాణాలు కోల్పోయింది.

ప్రమాదానికి కారణమైన ఎస్బీఐ ఉద్యోగి బీఎం ధర్మరాజును పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనపై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ స్పందిస్తూ.. రాంగ్‌ రూట్‌లో ప్రయాణించడం వల్ల ఓ యువతి భవిష్యత్తు అంధకారమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించవద్దని సూచించారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్