Magazines

బస్సును ఢీకొన్న కారు.. ఐదుగురు మృతి

18 అక్టోబర్, 2026

Accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలం-గాణ హైదరాబాద్‌: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు బస్సును ఢీ కొట్టడంతో కారులోని ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన ఆదివారం బీడ్ జిల్లా పండర్‌పూర్-ఖామ్‌గావ్ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కారులో తుల్జాపూర్‌ అమ్మవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో మజల్‌గావ్-తెల్గావ్ రోడ్డు గుంతలను కారు బలంగా ఢీకొట్టింది. దీంతో డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొంది.


ఈ ధాటికి కారులోని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉంది. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా ధ్వంసమైంది. బస్సు ముందుభాగం పాక్ష‍ికంగా దెబ్బతింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో జాతీయ రహదారిపై స్థంభించిన ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్