నవతెలంగాణ-హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కంది మండలంలోని ప్యూర్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటీల తయారీ కంపెనీలో మంటలు చెలరేగాయి. తెల్లవారుజాము నుంచి కంపెనీ ప్రాంగణంలో మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం, ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం..స్కూటీ తయారీ కంపెనీలో ఎగిసిపడుతున్న మంటలు
22 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 05, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)