Magazines

స్కూల్‌ బస్సులో అగ్నిప్రమాదం.. 20 మంది విద్యార్థులు సురక్షితం

1 గంట క్రితం

Fire in school bus.. 20 students safe
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌ : తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో మంగళవారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులను పాఠశాల నుంచి ఇళ్లకు తీసుకెళ్తుండగా ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు ఇంజిన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్‌ బస్సును నిలిపివేశాడు. స్థానికులు సత్వరం స్పందించి బస్సు అద్దాలను పగలగొట్టి లోపల ఉన్న 20 మంది విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్‌, స్థానికుల సమయస్ఫూర్తిని పలువురు అభినందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్