నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (HCU) పరిధిలోని హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. ఎం అనెక్సీ, ఎన్ఆర్ఎస్ హాస్టళ్లలో 30 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో కొందరు వర్సిటీ హెల్త్ సెంటర్లో, మరికొందరు ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
మెస్‌లలో నెలకొన్న సమస్యలు, నాసిరకం ఆహారంపై విద్యార్థి సంఘం ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. హాస్టళ్లలో అత్యవసర వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. ఇంతమంది అస్వస్థతకు గురైనా వీసీ, రిజిస్ట్రార్ స్పందించకపోవడంపై విద్యార్థి సంఘం నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫుడ్ పాయిజన్‌తో బాధపడుతున్న విద్యార్థులకు పరీక్షల షెడ్యూల్లో సడలింపు ఇవ్వాలని కోరారు.





కామెంట్లు (0)