నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ సినీనటుడు గిరిబాబు (83) అంత్యక్రియలు నేడు (ఆదివారం) మధ్యాహ్నం ఏపీలోని ప్రకాశం జిల్లా రావినూతలలో నిర్వహించనున్నారు. ఆ గ్రామమంటే గిరిబాబుకు ఎంతో ఇష్టమని, ఆయన చివరి కోరిక మేరకే అక్కడ అంత్యక్రియలు జరుపుతున్నట్లు కుమారుడు రవిబాబు తెలిపారు. సెలవులు వచ్చినప్పుడల్లా ఎక్కువ సమయం స్వగ్రామంలోనే గడిపేవారని వెల్లడించారు. కాగా, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నిన్న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
నేడు సినీ నటుడు గిరిబాబు అంత్యక్రియలు
6 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 15, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)